తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతి కడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు - 1.5 kg stomach in girl's stomach

బంగాల్​లో ఓ యువతి కడుపులో నుంచి 1.5 కిలోల తల వెంట్రుకలు బయటపడ్డాయి. తన జట్టు తానే తిన్న ఆమెకు కడుపులో నుంచి శస్త్రచికిత్స ద్వారా వెంట్రుకలు బయటకు తీశారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు.

doctors
యువతి కుడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు!

By

Published : Aug 7, 2020, 1:13 PM IST

Updated : Aug 7, 2020, 2:07 PM IST

బంగాల్, ఝార్​గ్రామ్ లో ఓ యువతి కడుపులో నుంచి 1.5 కిలోల వెంట్రుకలు బయటకు తీశారు. తీవ్ర అస్వస్థతతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరిన 17 ఏళ్ల ఓ యువతి జీర్ణాశయంలో వెంట్రుకలున్నట్లు గుర్తించి, వెంటనే శస్త్ర చికిత్స చేశారు.

యువతి కడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు
యువతి కుడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు!

కొద్దిరోజులగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఆమె.. గట్టిగట్టిగా ఏడుస్తూ, తన వెంట్రుకలు తానే తినేసిందని... రోజుకు కొన్ని వెంట్రుకలు చేరి కడుపులో పేరుకుపోయాయని వైద్యులు చెప్పారు. వాటిని తీయకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం జరిగేదని తెలిపారు.

ఇదీ చదవండి: ఆసుపత్రుల అమానుషత్వం.. కొవిడ్​పై పోరులో గెలుపెలా?

Last Updated : Aug 7, 2020, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details