తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఎంసీ' బిల్లుపై నిరసనల సెగ- నిలిచిన సేవలు

జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు రెండో రోజూ ఉద్ధృతంగా సాగుతున్నాయి.  రెసిడెంట్​ వైద్యులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగటం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలూ నిలిచిపోయాయి.

By

Published : Aug 2, 2019, 12:48 PM IST

'ఎన్​ఎంసీ' బిల్లుపై నిరసనల సెగ- నిలిచిన సేవలు

'ఎన్​ఎంసీ' బిల్లుపై నిరసనల సెగ- నిలిచిన సేవలు

జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు చేపట్టిన నిరసనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెసిడెంట్​ వైద్యుల నిరసనలతో దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ సేవలతో పాటు అత్యవసర సేవలూ నిలిచిపోయాయి.

తమ ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎన్నిరోజులైనా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు వైద్యులు. రాజ్యసభలో ఎన్​ఎంసీ బిల్లుకు ఆమోదం లభించటం వల్ల ఎయిమ్స్​, ఆర్​ఎమ్​ఎల్​, ఫోర్డా, ఉర్డా వైద్య సంఘాలు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించాయి.

ఆందోళనలు విరమించారలి: హర్షవర్ధన్​

ఆందోళనలు చేపట్టిన వైద్యులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ సమావేశమయ్యారు. బిల్లులోని పలు నియమాలపై వైద్యుల్లో నెలకొన్న అపార్థాలను తొలగించామని తెలిపారు.

" జాతీయ వైద్య కమిషన్​ బిల్లు దేశం, ప్రజలు, రోగులు, వైద్య విద్యార్థులు, వైద్యుల ప్రయోజనాల నిమిత్తం తీసుకొచ్చినట్లు వివరించాము. వైద్యులు ఆందోళనలు చేయాలని మేము కోరుకోవడం లేదు. వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందరి ప్రయోజనాల నిమిత్తం వెంటనే ఆందోళనలు విరమించాలని కోరాం. "

- హర్షవర్థన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

ఇదీ చూడండి: వైద్యుల సమ్మె ఉద్ధృతం.. అత్యవసర సేవలూ బంద్​

ABOUT THE AUTHOR

...view details