కొవ్వొత్తుల కాంతిలో ఆపరేషన్! ఇంత నిర్లక్ష్యమా? మధ్యప్రదేశ్ సత్నాలో నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచారు వైద్యులు. బర్సింగ్పుర్ హెల్త్ సెంటర్లో కొవ్వొత్తి, టార్చ్ లైట్ల వెలుతురులో 35 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) శస్త్ర చికిత్స చేశారు.
ప్రైవేటు దవాఖానాల్లో డబ్బులు చెల్లించే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే.. ఇక్కడ వైద్యులు, సిబ్బంది... రోగులను అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ కనీసం మంచాలు లేవు... ఆపరేషన్ థియేటర్ సక్రమంగా లేదు.. రోగి అవస్థలను అర్థం చేసుకునే వారే లేరు.
పురుష సిబ్బంది చేతులతో స్త్రీలను తాకుతూ, ఆపరేషన్ అనంతరం ఎత్తుకొచ్చి నేల మీద నిర్లక్ష్యంగా పడేస్తారు. కొన్ని పరుపులు ఉన్నప్పటికీ.. వాటి మధ్య కనీస దూరం లేకపోవడం గమనార్హం.
వైద్యుల నిర్వాకం కళ్ల ఎదురుగా కనిపిస్తున్నా.. వారు మాత్రం స్త్రీలను తామెంతో గౌరవిస్తామని, ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా చేస్తున్నామంటూ కప్పిపుచ్చుకుంటున్నారు.
"ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం మా దగ్గర ప్రత్యేక వార్డు ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఓ హాల్ ఉంది. అందులో పరుపు, దుప్పటి పరిచి ఉన్నాయి. ఆపరేషన్ అయిపోయిన వారిని మా సిబ్బంది ఎత్తుకెళ్లి అక్కడ పడుకోబెడతారు. ఇక్కడ మహిళల పట్ల చాలా గౌరవంతో, మానవీయతతో వ్యవహరిస్తాం. వీరి కోసం మాకు ప్రత్యేక భవనం లేనందున ఆ హాలులో నేలపై కాక, పరుపులపై పడుకోబెడుతున్నాం. "
-ఆర్ త్రిపాఠి, వైద్యుడు
ఇదీ చదవండి:మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు