కరోనా సాధారణ ప్రజలనే కాకుండా వైద్యులనూ కలవరపెడుతోంది. కర్ణాటక కలబురగిలో ఓ వైద్యుడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకి మార్చి 10న మరణించిన వృద్ధుడికి ఈ వైద్యుడే చికిత్స అందించినట్లు చెప్పారు.
చికిత్స చేసిన డాక్టర్‌కే కరోనా నిర్ధరణ - kalaburagi latest news
కర్ణాటకలో కరోనా సోకిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. వైద్యుడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
చికిత్స చేసిన డాక్టర్‌కే కరోనా నిర్ధరణ
ప్రస్తుతం డాక్టర్‌కు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వృద్ధుడు సహా కలబురగిలో ఇప్పటివరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Last Updated : Mar 17, 2020, 11:59 AM IST