కరోనా వైరస్ మన ధరి చేరకుండా మాస్క్ అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఒంటరిగా కారు నడుపుతున్నప్పుడు లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలా అనే అంశంపై స్పష్టత నిచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. ఇలాంటి సందర్భాల్లో మాస్కు పెట్టుకోవటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ, బృందంగా సైక్లింగ్, జాగింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.
ఒంటరిగా కారు నడుపుతున్నప్పుడు లేదా సైక్లింగ్ చేసేటప్పుడు మాస్క్ ధరించటం అవసరమా? లేదా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు భూషణ్.