తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుక్క కాటుకు 'శునకాలయం'లో పూజలతో చికిత్స!

ఛత్తీస్​గఢ్​లోని బలోద్ ప్రాంతంలో శునకానికి ఓ ఆలయం ఉంది. ఇక్కడ దేవుడితో సమానంగా శునక ప్రతిమకు పూజలు చేస్తారు. ఎవరినైనా కుక్క కరిస్తే ఈ ఆలయంలో పూజలు చేస్తే నయమవుతుందని స్థానికుల నమ్మకం. అసలు ఈ ఆలయం వెనుక కథ ఏంటో మీరే చూడండి.

కుక్క కరిస్తే 'శునకాలయం'లో ప్రత్యేక పూజలు..!

By

Published : Oct 6, 2019, 1:11 PM IST

కుక్క కరిస్తే 'శునకాలయం'లో ప్రత్యేక పూజలు..!

సాధారణంగా కుక్క కరిస్తే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడికి చూపిస్తాం. ఛత్తీస్​గఢ్​లోని బలోద్​ ప్రాంత ప్రజలు మాత్రం ఓ ఆలయానికి వెళ్తారు. అక్కడ ఉన్న శునక ప్రతిమకు పూజలు చేస్తారు. ఇలా చేస్తే వైద్యుల అవసరమే లేకుండా నయమవుతుందని స్థానికుల విశ్వాసం. అదే 'కుకుర్'​ శునకాలయం.

అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఆలయంలో దేవుడితో సమానంగా శునకాన్ని పూజిస్తారు. అసలు దీని వెనుక కథ ఏంటంటే..?

"ఛత్తీస్​గఢ్​లోని బలోద్​ ప్రాంతంలో ఓ గిరిజనుడికి 'కుకుర్​' అనే శునకం ఉండేది. ఒకసారి చేసిన అప్పు కట్టలేక ఆ శునకాన్ని వడ్డీ వ్యాపారికి ఇచ్చేశాడు. కొద్దికాలం అనంతరం ఆ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది.

దొంగలను గుర్తించిన శునకం చోరీకి గురైన సొమ్మును పట్టించింది. ఇందుకు కృతజ్ఞతగా ఆ గిరిజనుడు చేసిన అప్పు మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు ఓ లేఖ రాశాడట ఆ వ్యాపారి. ఈ లేఖను కుక్క మెడకు కట్టి పంపించాడు. ఈ విషయమేమీ తెలియని గిరిజనుడు.. శునకం మళ్లీ తన దగ్గరకు వచ్చిందని.. కర్రతో విచక్షణారహితంగా కొట్టడం వల్ల అది చనిపోయింది.

తర్వాత కుక్క మెడకు ఉన్న లేఖ తీసి చదివిన ఆ వ్యక్తి జరిగిన సంగతి తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శునకం జ్ఞాపకాలతో కుంగిపోయి ఓ ప్రతిమను చేయించాడు. దగ్గర్లోని ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఈ స్థలానికి కుకుర్ సమాధిగా నామకరణం చేశాడు."- స్థానికులు చెప్పే కథ

ఈ ఆలయంలో నందితో సమానంగా ఈ కుకుర్​ ప్రతిమకు పూజలు చేస్తారు. ఎవరినైనా కుక్క కరిస్తే ఈ ప్రతిమ దగ్గర నైవేద్యం పెట్టి.. దీపారాధన చేసి పూజలు చేస్తారు భక్తులు. అలా చేస్తే వైద్య చికిత్స తీసుకోనవసరం లేదని స్థానికులు నమ్ముతున్నారు.

ఇదీ చూడండి: బ్యాంకులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్​ నిర్మాతగా..!

ABOUT THE AUTHOR

...view details