కవాటం ఉన్న ఎన్-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.
'కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వాడొద్దు' - n95 face masks news
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎన్-95 మాస్కులు సురక్షితమని అందరు నమ్ముతున్నారు. అయితే.. కవాటం ఉన్న ఎన్-95 మాస్కులను వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు. వాటికి డిమాండ్ పెరిగిన వేళ ఆయన ఎందుకు వాడొద్దని పేర్కొంటున్నారో తెలుసుకుందాం.
కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వాడొద్దు
ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు డైరెక్టర్ జనరల్. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధారణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు