దేశంలో కరోనా వ్యాప్తికి ఒక వర్గాన్ని, ప్రాంతాన్ని కారకులుగా ఎత్తిచూపొద్దని ప్రభుత్వం ప్రజలను కోరింది. ఇటీవల తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువమంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి ఓ వర్గం కారణమని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
'కరోనా వ్యాప్తికి వర్గాన్ని, ప్రాంతాన్ని కారణంగా చూడకండి' - కరోనా తాజా వార్తలు
కరోనా వ్యాప్తికి దేశంలో ఓ వర్గం, ప్రాంతం కారణమని ఎత్తిచూపొద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. దిల్లీలో నిర్వహించిన తబ్లీగీ ప్రార్థనల కారణంగా దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇటువంటి పరిస్థితులు దేశంలో గందరగోళం, శత్రుత్వాలను పెంచుతాయని ప్రభుత్వం వివరించింది. కరోనా వ్యాప్తి క్రమంలో ప్రజలు చేయాల్సిన, చేయకూడని వాటి గురించి ఓ జాబితా విడుదల చేసింది. వైద్యులను, పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఎవరూ దురుసుగా ప్రవర్తించొద్దని, వారంతా సాయం చేసేందుకే ఉన్నారని తెలిపింది.
కరోనా సోకిన వ్యక్తులతో పాటు, శానిటరీ వర్కర్లు, ఆరోగ్య సంరక్షకులు, పోలీసులు వైరస్ వ్యాప్తి విషయంలో వస్తోన్న తప్పుడు సమాచారం కారణంగా వివక్ష ఎదుర్కొంటున్నట్లు వివరించింది. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకుంటున్న వారిని కొంతమంది తక్కువగా చూస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ప్రజలను కోరింది.