ప్రధానమంత్రి మోదీకి దమ్ముంటే తనపై దేశద్రోహం కేసు పెట్టాలని సినీయర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సవాల్ చేశారు. పుల్వామాపై ఆయన చేసిన ఒక ట్వీట్‌తో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు దోశద్రోహం ఆరోపణలు చేస్తున్నారు.
వివాదం ఇది
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోందని నిన్న ఒక ట్వీట్ చేశారు దిగ్విజయ్. ఇందులో 'పుల్వామా దుర్ఘటన' అని సంబోధించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ పాకిస్థాన్‌కు మద్ధతిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు.
దిగ్విజయ్ సింగ్ కూడా వరుస ట్వీట్లతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కూడా ఇలాంటి పదజాలాన్నే వాడారని దీనిపై భాజపా మౌనం వహిస్తోందని వ్యాఖ్యానించారు.