డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, పార్టీ యువత విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నాగపట్టణం జిల్లా తిరుక్కువళైలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు.
డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు - udayanidhi stallin news
తమిళనాడు నాగపట్టణం జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా.. డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. పోలీసుల చర్యను పార్టీ కార్యకర్తలు ఖండించారు.
స్టాలిన్ అరెస్టు
పోలీసుల చర్యలను డీఎంకే కార్యకర్తలు ఖండిస్తూ నిరసన తెలిపారు. ప్రచారాన్ని తిరిగి శనివారం ప్రారంభిస్తామని ఉదయనిధి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు.
ఇదీ చూడండి:ఎన్నికల వేళ ఆంక్షల వలయం- హోటళ్లలోనే నేతలు