తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట మరోమారు 'అనర్హత' రాజకీయం - డీఎంకే

తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం సహా మొత్తం 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. 2017 విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తమిళనాట మరోమారు 'అనర్హత' రాజకీయం

By

Published : Jul 2, 2019, 3:24 PM IST

అన్నా డీఎంకేకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్​ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2017నాటి విశ్వాస పరీక్షలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వీరిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

డీఎంకే పిటిషన్​పై సత్వర విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ నేపథ్యం...

2017 ఫిబ్రవరి 18న తమిళనాడు శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో పన్నీరు సెల్వం సహా 10 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేశారు. తరువాత ఈ రెండు వర్గాలు కలిసిపోయి... ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.

పన్నీర్ సెల్వం సహా 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్​ను గతేడాది ఏప్రిల్​లో మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే సుప్రీంను ఆశ్రయించింది.

ఇదీ చూడండి: ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్​ రిపీట్​!

ABOUT THE AUTHOR

...view details