తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య విద్యలో 7.5 శాతం అంతర్గత రిజర్వేషన్‌కు అనుమతివ్వనందుకు రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ నివాసం ఎదుట నిరసన చేపట్టింది ప్రతిపక్ష డీఎంకే. ఈ ధర్నాకు ఆ పార్టీ అధినేత ఎం.కె.స్టాలిన్ నేతృత్వం వహించారు.
అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం కానీ..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య విద్యలో 7.5 శాతం అంతర్గత రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుకు.. తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌కు సిఫారసు చేశారు. అయితే దీనిపై 35 రోజులకుపైగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు సీనియర్ నేతలు గవర్నర్‌ను ఇటీవల కలిసి బిల్లును ఆమోదించాల్సిందిగా కోరారు. అయినప్పటికీ భన్వరిలాల్ ఈ విషయంపై స్పందించలేదు.