ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన 'ఐప్యాక్' సంస్థతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వెల్లడించారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐప్యాక్ సంస్థ తమకు సేవలందిస్తుందని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన స్టాలిన్... 2021 ఎన్నికల్లో తమ ప్రణాళికకు ఓ రూపమిచ్చి తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహాయపడతారని స్టాలిన్ పేర్కొన్నారు.
ఇకపై డీఎంకే అధినేత స్టాలిన్‌కు అండగా పీకే - స్టాలిన్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన 'ఐప్యాక్' సంస్థతో కలిసి డీఎంకే పార్టీ కలిసి పనిచేయనుంది. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐప్యాక్ సంస్థ తమకు సేవలందిస్తుందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
స్టాలిన్ కోసం రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్
వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఐప్యాక్ తమిళనాడు విభాగం... డీఎంకే గెలుపు కోసం పనిచేస్తుందని ఐప్యాక్ సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. డీఎంకే ఘన విజయం కోసం ఐప్యాక్ తమిళనాడు బృందం ఉత్సాహంగా ఉందని తెలిపింది. తమకు అవకాశం కల్పించిన స్టాలిన్‌కు కృతజ్ఞతలు అని ఐప్యాక్ ట్విట్టర్‌లో పేర్కొంది.
ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్
Last Updated : Feb 28, 2020, 11:14 PM IST