జయలలిత అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు స్టాలిన్. ఆమె మరణం వెనక ఉన్న కుట్రదారులను ఊచలు లెక్కపెట్టిస్తామని అన్నారు.
ఈ ప్రకటన ఎన్నికల్లో లబ్ధి కోసం చేయటం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకే అధినేత్రి మరణం అనంతరం కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు స్టాలిన్. పొల్లాచ్చిలో డీఎంకే అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
డీఎంకే కోశాధికారి ఇంట్లో ఇటీవల ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విమర్శలు గుప్పించారు స్టాలిన్. అధికార పార్టీ తరఫున పోలీసులే డబ్బును తరలిస్తూ ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు.