తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయానికి బాంబు హెచ్చరిక - డీఎంకే కార్యాలయానికి బాంబు హెచ్చరిక

డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి బూటకపు బాంబు హెచ్చరికలు వచ్చాయి. పూర్తిగా తనిఖీలు చేసిన పోలీసులు.. ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదన్నారు. ఇదొక బూటకపు హెచ్చరిక అని ప్రకటించారు.

DMK HQ receives hoax bomb threat
DMK HQ receives hoax bomb threat

By

Published : Nov 29, 2019, 6:01 AM IST

తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి బాంబు హెచ్చరిక వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన అధికారులు తనిఖీలు చేపట్టారు. జాగిలాలు, బాంబ్​ స్క్వాడ్​తో పూర్తిగా పరిశీలించారు.

ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదొక బూటకపు హెచ్చరిక అని తేల్చి చెప్పారు. ఫోన్​ చేసిన వ్యక్తి వివరాలు లభించాయని ప్రకటించారు.

ఇదీ చూడండి: నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి

ABOUT THE AUTHOR

...view details