తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు 'స్థానిక పోరు'లో డీఎంకే అభ్యర్థుల జోరు

తమిళనాడు పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 27 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించగా మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది డీఎంకే. శుక్రవారం బ్యాలెట్​ లెక్కింపును చేపట్టారు. మొదటి రౌండ్​లో డీఎంకే కూటమి 1895 వార్డులను గెలుచుకొని ముందంజలో ఉంది. అధికార అన్నాడీఎంకే, భాజపా కూటమి 1528 స్థానాలు నెగ్గింది.

dmk-has-clear-edge-over-ruling-aiadmk-in-tn-rural-civic-polls
తమిళనాడు 'స్థానిక పోరు'లో డీఎంకే అభ్యర్థుల జోరు

By

Published : Jan 3, 2020, 4:27 PM IST

తమిళనాడులో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్​లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కూటమి బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొత్తం 5090 వార్డులకు గాను డీఎంకే కూటమి ఇప్పటికే 1895 వార్డులను కైవసం చేసుకుంది. ఇందులో డీఎంకే 1715 దక్కించుకోగా.. కాంగ్రెస్​ 96, సీపీఐ 60, సీపీఎం 24 చోట్ల నెగ్గింది. ఏఐఏడీఎంకే, భాజపా, డీఎండీకే కూటమి 1528 వార్డులను గెల్చుకుంది.

రాష్ట్రంలో ఇటీవల రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఏఐఏడీఎంకే విజయం సాధించింది. అయితే ఆ ఫలితాలే పునరావృతం అవుతాయని భావించిన అధికార పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో భంగపాటు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఫలితాలు ఎలా ఉన్నా ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు ఏఐఏడీఎంకే అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం. మొత్తం 27 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details