తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్భయ' నేర్పిన పాఠాలు.. మహిళా భద్రతవైపు అడుగులు

దేశ రాజధాని దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటన యావత్​​ దేశాన్ని కలచివేసింది. ఆ ఘటనకు నేటితో ఏడేళ్లు పూర్తయింది. అత్యంత పాశవిక చర్యను సమాజం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. దిల్లీ ప్రభుత్వం మహిళా భద్రతే లక్ష్యంగా  ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవేంటో చూద్దాం.

nirbhaya safety
నిర్భయతో మహిళా రక్షణ

By

Published : Dec 16, 2019, 6:01 AM IST

'నిర్భయ' ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి ఘటనలకు చరమగీతం పాడే దిశగా.. దిల్లీ ప్రభుత్వం మహిళా భద్రతే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రమంతటా సీసీటీవీలు, బస్సులో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది.

సీసీటీవి

మహిళల రక్షణ కోసం ఇప్పటిదాకా రాష్ట్రమంతటా దాదాపు లక్ష 3 వేల సీసీటీవి కెమెరాలను అమర్చింది. మరో లక్ష 7వేలు సీసీటీవీలను అమర్చటానికి సన్నాహాలు చేస్తోంది. మొత్తం మీద 70 నియోజకవర్గాల్లో 3 లక్షల సీసీటీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు ఓ ప్రభుత్వ అధికారి.

బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ

బస్సుల్లో ప్రయాణించే మహిళలకు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది సర్కారు. ఇటీవల పానిక్​ బటన్స్​, జీపీఎస్​ వ్యవస్థ, సీసీటీవీలను 428 క్లస్టర్​ బస్సుల్లో అమర్చింది.
5500 ప్రభుత్వ, క్లస్టర్​ బస్సుల్లో ఈ ప్రక్రియ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ తెలిపారు. ప్రతి బస్సులోనూ తప్పనిసరిగా మూడు సీసీటీవి కెమెరాలు, 10 పానిక్​ బటన్​లు, జీపీఎస్​ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 13 వేల మంది మార్షల్స్​ను మహిళా భద్రత కోసం బస్సుల్లో మోహరించింది ప్రభుత్వం.

తప్పనిసరి

బస్సులు, ఆటోరిక్షాలు, టాక్సీలు, క్యాబ్స్​ వంటి వాహనాల్లోనూ జీపీఎస్​ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. చీకటి ప్రదేశాల్లో రెండు లక్షల ఎల్​ఈడి లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ప్రతిజ్ఞ తప్పనిసరి

చిన్నతనం నుంచే విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పాఠశాల్లలో ప్రతిరోజు విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. తరగతి గదిలో గంట పాటు మహిళా శక్తి గురించి బోధించేలా చొరవ తీసుకున్నట్లు అధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి : 'ఉరితీసే అవకాశమివ్వండి..' రక్తంతో క్రీడాకారిణి లేఖ

ABOUT THE AUTHOR

...view details