వెలుగుల పండుగ దీపావళిని జమ్ము ప్రజలు అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద భారత్-పాక్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునే ఆనవాయితీని ఈసారి పాటించలేదని అధికారులు తెలిపారు.
"రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లోని నియంత్రణరేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది మినహా మరెక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దీపావళి వేడుకలు శాంతియుతంగా జరుగుతున్నాయి. జమ్మూ యువత దీపావళి టపాసులు పేల్చుతూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు."- ఓ సైనికాధికారి
సైన్యం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది.. సరిహద్దు కంచె వద్ద నిన్న రాత్రి దీపాలను వెలిగించారు. ఐబీ, నియంత్రణరేఖ వెంబడి పహారా కాస్తున్న సైనికుల్లో పండుగ ఉత్సాహం నెలకొందని సైనికాధికారులు తెలిపారు.
మిఠాయిలు పంచుకోలేదు..