తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ కుటుంబాల్లో విషాదం మిగిల్చిన 'దీపావళి'

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతుండగా.. కొందరి జీవితాల్లో చీకటి ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఓ బాలుడు మృతిచెందగా.. మొత్తంగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Diwali brought darkness in 10 people life at Bangalore
బెంగళూరులో పది మంది జీవితాల్లో చీకటి మిగిల్చిన దీపావళి

By

Published : Nov 15, 2020, 5:27 PM IST

దీపావళి పండుగ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాట ఊహించని రీతిలో జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బెంగళూరులో బాణసంచా కాలుస్తూ మరో 10మంది గాయపడ్డారు. బాధితులు వేరు వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బెంగళూరు ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరు మింటో, నలుగురు నారాయణ, ముగ్గురు నేత్రధామ ఆసుపత్రులలో చేరారు. వీరిలో మింటో వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ 12ఏళ్ల బాలుడు కంటి గాయాలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడులో ఇలా..

తమిళనాడులోని కల్లకూరిచిలో దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తున్న వేళ.. ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణించాడు.

కొంగరాయపాలయంలో బియ్యం దుకాణాన్ని నడిపే కృష్ణ సామి.. దీపావళి సందర్భంగా టపాకాయలనూ అమ్మకానికి ఉంచాడు. శనివారం సాయంత్రం అతడి షాప్​ సమీపంలోనే కుమారుడు దర్శిత్​ (18నెలల వయస్సు) తన తోటివారితో ఆడుకుంటున్నాడు. ఇంతలో గుర్తుతెలియని ఓ వ్యక్తి పేల్చిన బాణం.. బియ్యం దుకాణంలోకి వచ్చిపడింది. దీంతో షాప్​లోని టపాసులన్నీ ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ దుర్ఘటనలో దర్శిత్​ ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరు చిన్నారులు నివేదా(7), వర్ష(6) తీవ్రంగా గాయపడ్డారు. వారిని సేలం ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం

ABOUT THE AUTHOR

...view details