తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా రాష్ట్రం అట్టుడుకుతుంటే ఇంట్లో కూర్చుంటానా?' - ఫరూక్​ అబ్దుల్లా

తనను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసినట్టు ఫరూక్​ అబ్దుల్లా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా లోక్​సభలో చేసిన వ్యాఖ్యలు తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాష్ట్రం అట్టుడుకుతుంటే తాను ఇంట్లో ఎలా ఉంటానని భావోద్వేగ ప్రసంగం చేశారు.

'నా రాష్ట్రం అట్టుడుకుతుంటే ఇంట్లో కూర్చుంటానా?'

By

Published : Aug 6, 2019, 5:54 PM IST

నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ(ఎన్​సీపీ) నేత ఫరూక్​ అబ్దుల్లా ఇష్టపూర్వకంగానే తన నివాసంలో ఉన్నారని కేంద్రహోంమంత్రి అమిత్​ షా లోక్​సభలో వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే జమ్ముకశ్మీర్​లోని తన నివాసం వద్ద ఫరూక్​ అబ్దుల్లా భావోద్వేగ ప్రకటన చేశారు. తనను ప్రభుత్వం నిర్బంధించిందని.. ఇంటి తలుపులను బద్దలుకొట్టుకుని మీడియాతో మాట్లాడటానికి వచ్చినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్​ ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'నా రాష్ట్రం అట్టుడుకుతుంటే ఇంట్లో కూర్చుంటానా?

"నా రాష్ట్రం అట్టుడుకుతున్న వేళ.. ప్రజలను జైళ్లల్లో చంపుతుంటే.. ఇళ్లల్లో చిత్రహింసలు పెడుతుంటే.. నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటానా? నేను విశ్వసించిన భారత్​ ఇది కాదు. నేను కోరిన ప్రజాస్వామ్య దేశం ఇది కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ రాష్ట్ర ప్రజలను కేంద్రం వెన్నుపోటు పొడిచింది. బయటకు వచ్చాక మేము ఈ విషయంపై పోరాటం చేస్తాం. నా కొడుకు(ఒమర్​ అబ్దుల్లా) జైల్లో ఉన్నాడు. ఇంకెంత మంది అమాయకులు జైలుకు వెళ్తారో నాకు తెలియదు."
--- ఫరూక్​ అబ్దుల్లా, నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత.

తన ఇంటి ఎదుట డీసీపీని మోహరించి.. తనను నిర్బంధించలేదని అమిత్​ షా ఎలా అనగలుగుతారని ఫరూక్​ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:- లైవ్​ వీడియో: బైకర్​ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి

ABOUT THE AUTHOR

...view details