కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు గురువారం భాజపాలో చేరనున్నట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్నారాయణ్ తెలిపారు. అనర్హత నిర్ణయాన్ని సమర్థిస్తూ, అదే సమయంలో ఆ 17 మంది ఉపఎన్నికల్లో పోటీచేయొచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటలకే ఈ ప్రకటన చేశారు నారాయణ్.
గురువారం ఉదయం 10న్నర గంటలకు బెంగళూరులో ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ సమక్షంలో అనర్హత ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు నారాయణ్.