డిసెంబర్ 5న జరగాల్సిన కర్ణాటక ఉపఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ అనర్హత వేటుపడిన 17 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేలు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.
స్పీకర్ తమపై అనర్హత వేటు వేయడానికి వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు అక్టోబర్ 25న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఖాళీ అయిన స్థానాలకు డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్ల సమర్పణకు గడువిచ్చింది. నిజానికి అక్టోబర్ 21నే ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అనర్హతకు గురైన ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున ఈ ఎన్నికలను డిసెంబర్ 5కు వాయిదా వేసింది ఈసీ.
పోటీ చేసే అవకాశం లేక..