తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉపఎన్నికల్లో 'అనర్హత' ఎమ్మెల్యేల పోటీకి మార్గం సుగమం - కర్ణాటక ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు

కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్పీకర్​ నిర్ణయాన్ని సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం.. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చని స్పష్టం చేసింది.

నేడే సుప్రీం తీర్పు-తేలనున్న కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేల భవితవ్యం

By

Published : Nov 13, 2019, 11:07 AM IST

Updated : Nov 13, 2019, 12:01 PM IST

కర్ణాటకలో అనర్హతకు గురైన ఎమ్మెల్యేల పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అప్పటి స్పీకర్ రమేశ్​​కుమార్ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వారందరూ ఉప ఎన్నికల్లో తిరిగి పోటీచేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని అభిప్రాయపడింది. డిసెంబరు 5న జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 మంది ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేసింది సుప్రీం. వీరంతా మంత్రి పదవులూ చేపట్టవచ్చని స్పష్టం చేసింది.

సభాకాలం ముగిసే వరకూ అనర్హత విధించడాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం తప్పుబట్టింది. ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించకుండా సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసిన తీరు సరికాదని పేర్కొంది.

సుప్రీం తీర్పును స్వాగతించిన అనర్హత ఎమ్మెల్యే

కర్ణాటక అనర్హత ఎమ్మెల్యే ఎ.హెచ్ విశ్వనాథ్.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఎమ్మెల్యేలు ఉప్పఎన్నికల్లో పోటీ చేయొచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​ వైమానిక మ్యూజియంలో అభినందన్​!

Last Updated : Nov 13, 2019, 12:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details