గల్వాన్ వద్ద భారత్-చైనా బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర చైనా బలగాలు వెనక్కి వెళ్లాయి.
సైనిక కమాండర్ల స్థాయిలో మూడు దఫాలుగా జరిగిన చర్చలతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ దౌత్యంతో సోమవారం ప్రారంభమైన బలగాల తరలింపు ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది.