అతికొద్ది మందితో అంతర్జాతీయ వృద్ధి సాధించలేమని.. ఈ విషయంపై చర్చించేందుకు ఎక్కువ దేశాలు కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకోసం అజెండా కూడా విస్తృతంగా ఉండాలని పేర్కొన్నారు. వృద్ధి విధానం మానవ కేంద్రంగా సాగాలని అభిప్రాయపడ్డారు.
'6వ ఇండో-జపాన్ సంవాద్' కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొన్నారు ప్రధాని.
"సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధాల వరకు.. ఆయుధాల పోటీ నుంచి అంతరిక్ష పోటీ వరకు.. ఇతరులను కిందకు లాగే విధంగానే మన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాలి. అందరూ కలిసి పైకి ఎదుగుదాం. అంతర్జాతీయ వృద్ధిపై చర్చ కొద్దిమంది మధ్యే ఉండకూడదు. ఇందులో పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి. అజెండా కూడా విస్తృతంగా ఉండాలి. మానవ కేంద్రంగా వృద్ధి విధానం ఉండాలి. ఇరుగుపొరుగువారితో అందరం సామరస్యంతో మెలగాలి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.