తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం - మోదీ

లైవ్​: కాసేపట్లో లోక్​సభలో 'కశ్మీర్'​పై చర్చ

By

Published : Aug 6, 2019, 10:20 AM IST

Updated : Aug 6, 2019, 7:45 PM IST

19:40 August 06

లోక్​సభ నిరవధిక వాయిదా

జమ్ముకశ్మీర్​కు 370 రద్దు తీర్మానం, విభజన బిల్లు, రిజర్వేషన్​ బిల్లును ఆమోదించిన అనంతరం లోక్​సభ నిరవధిక వాయిదా పడింది.

జూన్​ 17న ప్రారంభమైన లోక్​సభ.. జులై చివరి వారంలోనే ముగియాల్సి ఉంది. కానీ ముఖ్య బిల్లులపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను పొడిగించింది.

19:40 August 06

  • జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  • బిల్లుకు అనుకూలంగా370ఓట్లు,వ్యతిరేకంగా70ఓట్లు
  • ఆర్టికల్‌370రద్దుకు లోక్‌సభ ఆమోదం
  • బిల్లుకు అనుకూలంగా351ఓట్లు,వ్యతిరేకంగా72ఓట్లు
  • జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం

19:27 August 06

  • రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనున్న జమ్ముకశ్మీర్ పునర్విభజనబిల్లు
  • ఇకనుంచి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌
  • ఇకనుంచి అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌

19:26 August 06

ఉభయసభల్లో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం

జమ్ముకశ్మీర్​ విభజన బిల్లును లోక్​సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 370, వ్యతిరేకంగా 70 ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రపతి ఆమోదం అనంతరం బిల్లు చట్టంగా మారనుంది.

19:15 August 06

జమ్ముకశ్మీర్​ విభజన బిల్లుకు లోక్​సభ ఆమోదం

  • ఆర్టికల్​ 370 రద్దు తీర్మానానికి లోక్​సభ ఆమోదం.
  • తీర్మానానికి అనుకూలంగా 351, వ్యతిరేకంగా 72 మంది ఓటు.

19:14 August 06

  • జమ్ముకశ్మీర్‌కు కేంద్రం ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయి
  • ఆ నిధులతో జమ్ముకశ్మీర్‌ గ్రామాల్లో ఎలాంటి మార్పు రాలేదు
  • జమ్ముకశ్మీర్‌ గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు కూడా లేవు
  • జమ్ముకశ్మీర్‌ ప్రజలను పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి

19:01 August 06

ఆర్టికల్​ 370 రద్దు తీర్మానానికి లోక్​సభ ఆమోదం

జమ్ముకశ్మీర్​ విభజన బిల్లుపై లోక్​సభలో ఓటింగ్​ జరుగుతోంది.

18:56 August 06

లోక్​సభలో ఓటింగ్​

  • జమ్ముకశ్మీర్‌కు కేంద్రం ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయి
  • ఆ నిధులతో జమ్ముకశ్మీర్‌ గ్రామాల్లో ఎలాంటి మార్పు రాలేదు
  • జమ్ముకశ్మీర్‌ గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు కూడా లేవు
  • జమ్ముకశ్మీర్‌ ప్రజలను పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి

18:35 August 06

జమ్ముకశ్మీర్​ స్థితిపై అమిత్​ షా ఆగ్రహం

  • ఆర్టికల్‌370ద్వారా మైనార్టీలకు అన్యాయం జరిగింది
  • కశ్మీర్‌లో మైనార్టీలంటే హిందువులు,సిక్కులు,జైనులు
  • ఆర్టికల్‌370వల్ల70ఏళ్లలో జమ్ముకశ్మీర్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటి?
  • కశ్మీర్‌ నష్టపోయేందుకు కారణం ఆర్టికల్‌370
  • జమ్ముకశ్మీర్‌లో బాల్య వివాహాలు చేయడం ఎంతవరకు సమంజసం
  • వివాహాల వయసు దేశమంతా ఒకలా ఉంటే జమ్ముకశ్మీర్‌లో మరోలా ఉంది
  • పీవోకే ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు
  • చారిత్రక తప్పిదం చేశామని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు
  • మేము చారిత్రక తప్పిదం చేయలేదన్న విషయం అసదుద్దీన్‌కు తెలుస్తుంది

18:33 August 06

'పీవోకే ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు'

ఆర్టికల్​ 371ను రద్దు చేసే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని అమిత్​ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్​ నేత మనీష్​ కుమార్​ అడిగిన ప్రశ్నకు అమిత్​ షా ఈ విధంగా సమాధానమిచ్చారు. అధికరణం 370ని ఆర్టికల్‌ 371తో పోల్చడం సరికాదన్నారు.

18:33 August 06

  • జమ్ముకశ్మీర్ వివాదాన్ని ఐరాస వద్దకు ఎవరు తీసుకెళ్లారు?
  • భారత్‌లో కలిసిన తర్వాత కూడా నెహ్రూ ఐరాస వద్దకు తీసుకెళ్లారు
  • జమ్ముకశ్మీర్‌ సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి
  • 370రద్దు నిర్ణయం మంచిదా కాదా అనేది భవిష్యత్తు చెబుతోంది
  • 370రద్దుపై ఎప్పుడు చర్చ జరిగినా ప్రజలంతా మోదీని గుర్తుచేసుకుంటారు

18:17 August 06

'ఆర్టికల్​ 371ను రద్దు చేయం'

18:12 August 06

'మోదీని ప్రజలు గుర్తుచేసుకుంటారు'

లోక్​సభలో అమిత్​ షా ప్రసంగం...

  • ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు
  • జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం
  • జమ్ముకశ్మీర్‌ ఎంతకాలం యూటీగా ఉంటుందనే సందేహం ఉంది
  • సాధారణ పరిస్థితులు నెలకొన్నాక రాష్ట్రంగా మారుతుంది
  • పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమే

18:12 August 06

జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ను జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోబాల్​​ కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, అంతర్గత భద్రత అంశాలపై చర్చించారు.

18:00 August 06

'పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగమే'

ఆర్టికల్​ 370 రద్దుపై పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ స్పందించారు. ఈ అంశాన్ని ఐరాస దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. మైనారిటీలపై భాజపా జాత్యాహంకార సిద్ధాంతాన్ని అంతర్జాతీయ సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు.

18:00 August 06

లద్దాఖ్​ ఎంపీ జమ్​యంగ్​ను​ ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. లద్దాఖ్​ ప్రజల ఆకాంక్షలను తన ప్రసంగంలో అద్భుతంగా వివరించారని కొనియాడారు ప్రధాని.

17:51 August 06

సత్యపాల్​తో అజిత్​ డోబాల్​

ఫరూక్‌ అబ్దుల్లాను ఎవరూ అరెస్టు చేయలేదనిఅమిత్‌షా మరోమారు స్పష్టం చేశారు.ఆరోగ్యం బాగా లేదని ఫరూక్‌ అబ్దుల్లా ఇంట్లోనే ఉన్నారని వివరించారుఅమిత్‌షా.

ఫరూక్‌ చికిత్స కోసం వైద్య బృందాన్ని పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

17:51 August 06

ఫరూక్​ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు...

  • మేం ఆందోళనకారులం కాదు..విధ్వంసకారులం కాదు
  • కశ్మీర్‌ సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం
  • నన్ను నిర్బంధించారు..ప్రజలను జైలులో పెట్టారు
  • గృహనిర్బంధం నుంచి బయటకు రాగానే న్యాయపోరాటం చేస్తాం
  • కేంద్ర నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామికం
  • భారత్‌ ప్రజాస్వామ్య,లౌకిక దేశం
  • జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

17:41 August 06

'ఐరాస దృష్టికి తీసుకెళ్తాం'

  • 370రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
  • పిటిషన్ వేసిన సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.ఎల్.శర్మ
  • రాజ్యాంగ విరుద్ధంగా ఉత్తర్వులు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్న శర్మ
  • ఆర్టికల్‌370రద్దును సవాల్‌ చేసిన ఎం.ఎల్‌.శర్మ

17:15 August 06

లద్దాఖ్​ ఎంపీపై మోదీ ప్రశంసల వర్షం...

జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియదని గవర్నరే అన్నారు: అఖిలేశ్‌

రెండ్రోజులుగా ఏం జరుగుతుందో అందరం చూస్తున్నాం: అఖిలేశ్‌

జమ్ముకశ్మీర్ ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు: అఖిలేశ్‌

16:40 August 06

ఫరూక్​ అబ్దుల్లాను ఎవరూ అరెస్టు చేయలేదు: అమిత్​ షా

జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతుందో తెలియదని గవర్నరే అన్నారు: అఖిలేశ్‌

రెండ్రోజులుగా ఏం జరుగుతుందో అందరం చూస్తున్నాం: అఖిలేశ్‌

జమ్ముకశ్మీర్ ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు: అఖిలేశ్‌

16:15 August 06

నన్ను నిర్బంధించారు: ఫరూక్​ అబ్దుల్లా

కశ్మీర్​ విభజన బిల్లుకు తెరాస మద్దతు పలికింది. చారిత్రక తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం నేడు సరిదిద్దిందని తెరాస సభ్యుడు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

15:54 August 06

370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్​

  • ఫరూక్‌ అబ్దుల్లాను ఎవరూ అరెస్టు చేయలేదు, ఆయనే ఇంట్లో ఉన్నారు: అమిత్‌షా

14:56 August 06

అఖిలేశ్​ వాదన...

ఆర్టికల్​ 370 రద్దును బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు. రద్దు చేసే ముందు అన్ని పార్టీలు, కశ్మీర్ ​వాసులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.

14:45 August 06

బిల్లుకు తెరాస మద్దతు...

పాకిస్థాన్​ పార్లమెంటులో గందరగోళ వాతావరణం నెలకొంది. కశ్మీర్​ అంశంపై చర్చ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ గైర్హాజరయ్యారు. ఇమ్రాన్​​ ఖాన్​ రాకపోవడంపై సభ్యులు నిరసన తెలిపారు. చర్చ జరగకుండా అడ్డుకున్నారు.  

14:43 August 06

ఫరూక్​ను అరెస్ట్​ చేయలేదు: షా

నాడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీని అరెస్టు చేసినప్పుడు 40 రోజులపాటు ఎక్కడ ఉంచారో తెలియదు: కేంద్ర సహాయమంత్రి డా. జితేంద్రసింగ్‌

ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌ నేతలను గృహనిర్బంధం చేసి 2 రోజులైనా కాకముందే ఎక్కడ అని ఆందోళన చేస్తున్నారు: జితేంద్రసింగ్‌

చరిత్రలో భాగమయ్యే అవకాశం అరుదుగా వస్తుంది: జితేంద్రసింగ్‌

ఇవాళ ఎన్డీయే సభ్యులందరికీ అలాంటి అరుదైన అవకాశం లభించింది: జితేంద్రసింగ్‌

భారతదేశ పునర్నిర్మాణంలో ఇవాళ ఓ చరిత్ర: జితేంద్రసింగ్‌

ఈ చరిత్రలో భాగస్వామ్యులవుతున్నందుకు ఎన్డీయే సభ్యులంతా గర్వపడుతున్నారు: జితేంద్రసింగ్‌

ఈ చారిత్రక ఘట్టం మోదీ, షా చేతులమీదుగా జరగాలని రాసి ఉంది: జితేంద్రసింగ్‌

అందుకే వారిద్దరూ ప్రధాని, హోంమంత్రిగా ఉన్నారని అనుకోవచ్చు: జితేంద్రసింగ్‌

నాడు నెహ్రూ వేరేలా ఆలోచించి ఉంటే భారత ఉపఖండ చరిత్ర మరోలా ఉండేది: జితేంద్రసింగ్‌

సర్దార్‌ పటేల్‌ కంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుని నెహ్రూ.. పటేల్‌ను దూరంగా ఉంచారు: జితేంద్రసింగ్‌

జునాగఢ్‌, హైదరాబాద్‌ సంస్థానాలను పటేల్‌ విజయవంతం చేశారు: జితేంద్రసింగ్‌

కానీ నెహ్రూ జమ్ము-కశ్మీర్‌ విషయంలో ఆ పని చేయలేకపోయారు: జితేంద్రసింగ్‌

నాటి హోంమంత్రిగా ఉన్న పటేల్‌ను జమ్ము-కశ్మీర్‌ విషయంలో తన పని తనను నెహ్రూ చేయనీయలేదు: జితేంద్రసింగ్‌

నాడు జమ్ము-కశ్మీర్‌ విషయంలో నెహ్రూ జోక్యం చేసుకోక ఉండి ఉంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు: జితేంద్రసింగ్‌

14:30 August 06

చారిత్రక తప్పిదం: జోషి

కశ్మీర్​ విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్​ కాంగ్రెస్​ సభ్యులు సభ నుంచి వాకౌట్​ చేశారు.

13:26 August 06

'కశ్మీర్​ వాసులతో చర్చించి ఉండాల్సింది'

  • తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు అమిత్‌షా: డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు
  • రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంలో పద్ధతులు పాటించలేదు: టి.ఆర్‌.బాలు
  • రాష్ట్ర విభజన అంశంపై మొదటగా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి: టి.ఆర్‌.బాలు
  • సభలో ప్రవేశపెట్టాక తీర్మానం ఆమోదం పొందాలి: టి.ఆర్‌.బాలు
  • సభ ఆమోదించిన తీర్మానానికి రాష్ట్రపతి పచ్చజెండా ఊపాలి: టి.ఆర్‌.బాలు
  • అనంతరం రాష్ట్ర విభజన బిల్లును సభ ముందుకు తీసుకురావాలి: టి.ఆర్‌.బాలు
  • రాష్ట్ర శాసనసభను సంప్రదించలేదు: డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు
  • ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ లేదని చెబుతున్నారు: టి.ఆర్‌.బాలు
  • శాసనసభకు ఎన్నికలు నిర్వహించి సభ కొలువు దీరాకే బిల్లు తీసుకురావచ్చు కదా: టి.ఆర్‌.బాలు
  • సంఖ్యాబలంతోనే అన్ని బిల్లులను ఆమోదించుకుంటూ వెళ్లకూడదు: టి.ఆర్‌.బాలు
  • ఇదే అలవాటుగా మారితే పార్లమెంటు... బిల్లుల తయారీ కేంద్రంగానే మిగిలిపోతుంది: టి.ఆర్‌.బాలు
  • ఈ బిల్లు ఆమోదం ద్వారా మీరు పొందాలనుకున్న అంతిమ ఫలితమేంటి?: టి.ఆర్‌.బాలు
  • ఒక బలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ స్థాయికి తీసుకొస్తున్నారు: టి.ఆర్‌.బాలు

13:03 August 06

పాక్​ పార్లమెంటులో గందరగోళం...

12:57 August 06

'ఇదొక చారిత్రక ఘట్టం'

12:45 August 06

తృణమూల్​ కాంగ్రెస్​ వాకౌట్​...

12:28 August 06

తిమ్మిని బమ్మిని చేయగలరు: డీఎంకే

12:02 August 06

కాంగ్రెస్​కు సూటి ప్రశ్న..

అమిత్​ షా

జమ్ము-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని అమిత్‌షా తెలిపారు. రాజ్యాంగంలో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. జమ్ము-కశ్మీర్‌ విషయంలో చట్టం చేయడానికి పార్లమెంటుకు పూర్తి అధికారం ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. చట్టం చేయకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. పీవోకే, ఆక్సాయ్‌చిన్‌ కూడా జమ్ము-కశ్మీర్‌లో అంతర్భాగమేనన్నారు. పీవోకే జమ్ము-కశ్మీర్‌లో అంతర్భాగం కాదని మీరనుకుంటున్నారా అని కాంగ్రెస్​ను ప్రశ్నించారు.

11:57 August 06

రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్​

  • రాత్రికిరాత్రే అన్ని నిబంధనలు తోసిపుచ్చి జమ్ము-కశ్మీర్‌ను విభజించారు: కాంగ్రెస్‌
  • ద్వైపాక్షిక వివాదంగా ఉన్న అంశం అంతర్గత విషయం ఎలా అవుతుంది: కాంగ్రెస్‌
  • జమ్ము-కశ్మీర్‌కు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం చెప్పట్లేదు: కాంగ్రెస్‌
  • మాజీ సీఎంలను గృహనిర్బంధం చేశారు... అమర్‌నాథ్‌ యాత్రను ఆపారు: కాంగ్రెస్‌
  • 1948 నుంచి ఐరాస పరిశీలిస్తున్న అంశం అంతర్గత విషయం ఎలా అవుతుంది: కాంగ్రెస్‌
  • సిమ్లా-లాహోర్‌ ఒడంబడికలోని ఈ విషయం అంతర్గత విషయం ఎలా అవుతుంది: కాంగ్రెస్‌

11:48 August 06

నెహ్రూ కారణంగానే: కాంగ్రెస్​

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ మొదలైంది. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్‌. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్​ను విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.

11:29 August 06

'ఇది ఒక మైలురాయి'

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ మొదలైంది. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్‌. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్​ను విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.

11:22 August 06

అమిత్​ షా వివరణ...

లోక్​సభలో కశ్మీర్​ అంశంపై చర్చకు ముందు ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్​షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​తో భేటీ అయ్యారు.

11:16 August 06

కాంగ్రెస్​ వాదన...

పార్లమెంటు ఆవరణలో కాసేపట్లో లోక్‌సభ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ కానున్నారు. 10.30 గంటలకు యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం జరగనుంది.

11:12 August 06

మొదలైన చర్చ...

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని తొలగించే ఆర్టికల్​ 370 రద్దుపై నేడు లోక్​సభలో చర్చ జరగనుంది. జమ్ము కశ్మీర్​ పునర్విభజన, రిజర్వేషన్​ బిల్లులనూ చర్చకు చేపట్టే అవకాశం ఉంది.

జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా సోమవారమే లోక్​సభలో ప్రవేశపెట్టారు. బిల్లును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్​ చేశాయి.

ప్రస్తుతానికి బిల్లును ప్రవేశపెడుతున్నామని.. మంగళవారమే సభ పరిశీలిస్తుందని నిన్న స్పష్టం చేశారు షా. సమాధానం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో నేడు దిగువసభలో సుదీర్ఘ చర్చ సాగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున లోక్​సభలో బిల్లు సులువుగానే ఆమోదం పొందనుంది.

11:00 August 06

మోదీతో షా భేటీ...

10:27 August 06

కాంగ్రెస్‌ భేటీ

10:10 August 06

కాసేపట్లో చర్చ...

Last Updated : Aug 6, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details