కేంద్రానికి సమాచార కమిషన్ (సీఐసీ)కీలక ఆదేశాలు జారీ చేసింది. గత పదేళ్ల కాలంలో క్రమశిక్షణ చర్యల ప్రక్రియను ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారుల పేర్లను వెల్లడించాలని సూచించింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలను తెలియచేయాలని సమాచార కమిషనర్ దివ్య ప్రకాశ్ సిన్హా స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలను ఎదుర్కొన్న సదరు ఐఏఎస్‌ల పేర్లను వెల్లడించడం పారదర్శకతకు మార్గం సుగమం చేస్తుందని సిన్హా పేర్కొన్నారు.