దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది సుప్రీంకోర్టు. అలాగే వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్నవారికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు అందించాలని తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది అశ్వనీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించిన.. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
'వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయండి' - వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు
వృద్ధులకు సమయానికి పింఛను పంపిణీ చేయాలని.. వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
!['వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయండి' Disburse pension to elderly on time; provide PPE, face masks to people in old age homes: SC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8290215-thumbnail-3x2-supreme-court.jpg)
'వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయండి'
దేశంలో కోట్లాది మంది వృద్ధులు కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వారికి ఈ సమయంలో మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు అవసరం మేరకు అందించాలని దిశానిర్దేశం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి:అయోధ్య రామాలయం నమూనా విడుదల