బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పనితీరుతో నిరాశ చెందినట్లు పేర్కొంది కాంగ్రెస్. ఈ అంశంపై త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమీక్షించనుందని తెలిపింది. బిహార్ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు చాలా దగ్గరగా వచ్చారని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం.
"ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. బిహార్లో మా పనితీరు పట్ల నిరాశ చెందాం. సీడబ్ల్యూసీ త్వరలోనే సమీక్షించి, తమ స్థానంపై అధికారిక ప్రకటన చేయనుంది. నరేంద్ర మోదీ 2014 నుంచి ప్రధాని అయినా, 2005 నుంచి నితీశ్ కుమార్ సీఎంగా ఉన్నా.. బిహార్ దేశంలోనే పేద రాష్ట్రంగా ఉందని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలి. "
- పి. చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి.