కర్ణాటకలో మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని సిద్ధార్థ వైద్య కళాశాల, ఆయన సోదరుడి కుమారుడు ఆనంద్ నివాసంలో రెండో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాలలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు.
రూ.5వేల కోట్ల ఆస్తుల గుర్తింపు
పరమేశ్వర్, మాజీ మంత్రి ఆర్.ఎల్.జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. 150 మందితో కూడిన ఐటీ అధికారులు తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించారు. జి. పరమేశ్వర్ సొంత జిల్లా తుమకూరులోని విద్యాసంస్థలు, బెంగళూరులోని ఆయన నివాసాల్లో కీలక పత్రాలను పరిశీలించారు. ఆయనను సుమారు11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు అధికారులు. పరమేశ్వర్‌కు మైసూరు, మండ్య, తుమకూరులతో పాటు ఆస్ట్రేలియా, మలేషియాల్లోనూ సిద్ధార్థ అనుబంధ సంస్థలు ఉన్నట్లు తేలింది. మొత్తంగా తన వ్యాపారాలతో ఆయనకు సుమారు రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సోదాల్లో సుమారు రూ.4.52 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సోదరుడి కుమారుడిపైనా..