తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరోగ్యం'పై కేజ్రీవాల్​, షీలా దీక్షిత్​ ట్వీట్లు

దిల్లీ సీఎం కేజ్రీవాల్​, మాజీ సీఎం షీలా దీక్షిత్​ ట్విట్టర్​లో పలకరించుకున్నారు. తన ఆరోగ్యంపై ఎందుకు ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారని, ఖాళీగా ఉంటే తమ ఇంటికి భోజనానికి రావొచ్చుగా అని కేజ్రీవాల్​ను ఉద్దేశించి ట్వీట్​ చేశారు షీలా దీక్షిత్​. తానెప్పుడూ ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడలేదని బదులిచ్చారు కేజ్రీవాల్​. ఇంటికి భోజనానికి ఎప్పుడు రమ్మంటారని దీక్షిత్​ను అడిగారు.

షీలా దీక్షిత్​, అరవింద్​ కేజ్రీవాల్​

By

Published : May 12, 2019, 5:30 AM IST

Updated : May 12, 2019, 7:18 AM IST

దేశ రాజధాని దిల్లీ ఎన్నికల వేడిలో ఉండగా.. ఆమ్​ఆద్మీ అధినేత, సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.. మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్​ ట్వీట్లతో పలకరించుకున్నారు.

ఆరోగ్యంపై పుకార్లెందుకు..

తన ఆరోగ్యంపై ఎందుకు లేనిపోనివి ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్​ను ప్రశ్నించారు షీలా దీక్షిత్​.

షీలా దీక్షిత్​ ట్వీట్​

" నా ఆరోగ్యంపై ఎందుకు పుకార్లు ప్రచారం చేస్తున్నారు. చేసేందుకు పనేమీ లేకపోతే... మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లొచ్చు కదా. అలాగే నా ఆరోగ్యం ఎలాగుందో కూడా చూడొచ్చు. తినడం సహా ఊహాగానాలు ప్రచారం చేయకుండా ఎన్నికల్లో ఎలా పోటీ పడాలో కూడా నేర్చుకుందువు గానీ"

- షీలా దీక్షిత్​, మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

మూడుసార్లు దిల్లీ సీఎంగా పని చేశారు షీలా దీక్షిత్​. ఈ సారి ఈశాన్య దిల్లీ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్నారు.

పెద్దలను గౌరవించడం తెలుసు

షీలా దీక్షిత్​ ట్వీట్​పై వెంటనే స్పందించారు కేజ్రీవాల్​. తమ ఆరోగ్యం గురించేమీ మాట్లాడలేదంటూ సమాధానమిచ్చారు.

అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​

"మీ ఆరోగ్యం గురించి నేనెప్పుడు? ఏం మాట్లాడాను? మాట్లాడనేలేదు. పెద్దలను గౌరవించాలని మా కుటుంబం నాకు నేర్పింది. జీవితాంతం మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు వైద్యం కోసం గతంలో విదేశాలకు వెళుతున్నారని తెలిసి, పిలవకపోయినా మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నా. మీ ఇంట్లో భోజనం చేసేందుకు ఎప్పుడు రమ్మంటారు" -- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

ఇంట్లోనే ఆరోగ్యంగా ఉన్నారు

కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఇంట్లో భోజనం చేస్తోన్న షీలా దీక్షిత్ వీడియోను ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు ఆమె​ కుమారుడు సందీప్​.

షీలాదీక్షీత్​ ఆరోగ్యం సరిగా లేదని, ఆమె ఆసుపత్రిలో ఉన్నారంటూ ఆమ్​ఆద్మీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత పర్వేజ్​. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు.

దీక్షిత్​ ఆసుపత్రిలో ఉన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దిల్లీలోని జఫ్రాబాద్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు ఓ కాంగ్రెస్​ కార్యకర్త.

భాజపా సిట్టింగ్​ ఎంపీ మనోజ్​ తివారీపై ఈశాన్య దిల్లీ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు షీలా దీక్షిత్​. ఈ స్థానంలో దిలీప్​ పాండే ఆప్​ అభ్యర్థి.

ఇదీ చూడండి : మోదీ హెలికాప్టర్​నూ తనిఖీ చేయండి : మమత

Last Updated : May 12, 2019, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details