తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేను రాలేను... మీరే రండి: మెహుల్​ చోక్సీ - రికార్డు

పీఎన్​బీ కుంభకోణంలో కీలక నిందితుడు మెహుల్​ చోక్సీ బాంబే హై కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. తాను చికిత్స కోసమే విదేశాలకు వచ్చానని... విచారణ నుంచి తప్పించుకునేందుకు కాదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​కు రాలేనని ముఖం చాటేశారు.

నేను రాలేను... మీరే రండి: మెహుల్​ చోక్సీ

By

Published : Jun 17, 2019, 11:07 PM IST

పీఎన్‌బీ(పంజాబ్​ నేషనల్​ బ్యాంకు) కుంభకోణం కేసులో కీలక నిందితుడు మెహుల్ చోక్సీ భారత్ వచ్చేందుకు మరోసారి ముఖం చాటేశారు. వైద్య కారణాల దృష్ట్యా తాను ఆంటిగ్వా నుంచి భారత్​కు ప్రయాణించలేనని బాంబే హై కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

పూర్తిగా కోలుకున్నాక గాని భారత్​కు రాలేనన్నారు. అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, ఈడీ అధికారులే ఆంటిగ్వా వచ్చి కానీ తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవచ్చని చోక్సీ అన్నారు.

ఇదీ నేపథ్యం...

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​ మోదీ, అతని మామ మెహుల్​ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్​కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

చోక్సీని 'తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు'గా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన దరఖాస్తుపై కోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details