బంగాల్లో విధ్వంసాన్ని మిగిల్చిన ఫొనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ రంగు పులుముతున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి దీదీ అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాల్లోని తమ్లుక్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ.
"ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఇంతకుముందే చూసివచ్చాను. బంగాల్‌లోనూ పరిస్థితి ఏంటో చూద్దామనుకున్నాను. కానీ స్పీడ్‌బ్రేకర్ దీదీ తుపాను విషయంలోనూ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. తుపాను సమయంలోనూ దీదీతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. వారికి ఎంత అహంకారమంటే నాతో దీదీ మాట్లాడలేదు. తిరిగి ఫోన్ చేస్తారని ఎదురుచూశాను. కానీ దీదీ ఆ పని చేయలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు... దీదీకి రాజకీయాలే ముఖ్యం. బంగాల్ ప్రజలు వారికి అవసరం లేదు. ఈ విషయంలో దీదీ నన్ను అడ్డుకుని బంగాల్ అభివృద్ధికి బ్రేక్ వేశారు."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి