రాష్ట్రపతిభవన్లో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుద్ధ భగవానునికి పుష్పాంజలి ఘటించి... ధర్మచక్ర దినోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. వర్చువల్ వేదికగా దేశ ప్రజలకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
"దేశ ప్రజలకు ధర్మచక్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది జ్ఞానం ప్రసాదించిన గురువులను స్మరించుకోవాల్సిన రోజు. బుద్ధుడి అష్టాంగ మార్గం మానవజాతికి సర్వదా అనుసరణీయం. ఆయన బోధనలు భూత, వర్తమాన, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం.
ఇవాళ అసాధారణ సవాళ్లతో ప్రపంచం పోరాటం చేస్తోంది. ఇలాంటి సమయంలో బుద్ధుడి మార్గం అనుసరిస్తే.. ఈ సవాళ్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ."