తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిడతలతో విమానాలకూ ముప్పు: డీజీసీఏ - locust swarm during flight take off

మిడతలు తక్కువ ఎత్తులో ప్రయాణించటం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్​లో సమస్యలు వస్తాయని డీజీసీఏ హెచ్చరించింది. ఇంజిన్లతో పాటు వివిధ భాగాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పైలట్లు, ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసింది.

DGCA
విమానం

By

Published : May 29, 2020, 7:41 PM IST

Updated : May 29, 2020, 8:22 PM IST

మిడతల దండును ఎలా ఎదుర్కోవాలో పైలట్లు, ఇంజనీర్లకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. క్లిష్టమైన ల్యాండింగ్, టేకాఫ్ దశలో ఈ మిడతల దండుతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

"సాధారణంగా మిడతలు తక్కువ ఎత్తులోనే ఎగురుతాయి. అందువల్ల టేకాఫ్​, ల్యాండింగ్​ సమయంలో విమానాలకు ప్రమాదం ఉంటుంది. మిడత పరిమాణం చాలా చిన్నది. పెద్ద సంఖ్యలో వచ్చే మిడతల ద్వారా విండ్​షీల్డ్​పై ప్రభావం అధికంగా ఉంటుంది. ఫలితంగా పైలట్​ ముందు దృష్టిని ప్రభావితం చేస్తుంది. ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఎదురయ్యే సమస్య ఇదే. పెద్ద సంఖ్యలో మిడతలు ఇంజిన్​ ఇన్​లెట్​, ఎయిర్​ కండిషనింగ్​ ప్యాక్ ఇన్​లెట్​లోకి ప్రవేశించే అవకాశం ఉంది."

- విమానయాన నియంత్రణ సంస్థ

డీజీసీఏ మార్గదర్శకాలు..

  • పిటాట్​, స్టాటిక్​ వంటి భాగాలను పాక్షికంగా లేదా పూర్తిగా మూసి ఉంచాలి. విమానాల్లో పిటాట్​ నాళం గాలి వేగాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు. వీటిని మూసి ఉంచటం ద్వారా గాలి, ఎత్తు సూచీల్లో తప్పులు చూపించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • విండ్ షీల్డ్​పై ఉండే వైపర్లను ఉపయోగిస్తే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పైలట్​ గుర్తుంచుకోవాలి.
  • మిడతలు భారీ సంఖ్యలో ఉంటే అసలేమీ కనిపించకపోవచ్చు. అందువల్ల ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మిడతల ఉనికిపై అప్రమత్తంగా ఉండాలి.
  • విమానాశ్రయ పరిసరాల్లో మిడతలు ఉన్నట్లు గుర్తిస్తే.. ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్లు వెంటనే వచ్చే విమానాలతో పాటు వెళ్లేవాటికి సమాచారం అందివ్వాలి.
  • మిడతలు పగటి పూటే దండెత్తుండటం వల్ల పైలట్​ ఎప్పుడూ వాటిని గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా మిడతల దండు ఉనికిని గుర్తిస్తే పైలట్లు వెంటనే సమాచారం అందించాలి.
  • అన్నింటికన్నా ముఖ్యంగా మిడతలను గుర్తిస్తే విమానాన్ని వెంటనే నిలువరించాలి. వీలైనంత వరకు ప్రయాణాన్ని వాయిదా వేయటం మంచిది.
  • మిడతల గుంపులో నుంచి విమానం వెళ్లినట్లయితే ల్యాండింగ్ తర్వాత సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. వచ్చే ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.

భారత్​లో 21 ఏళ్ల తర్వాత ఎడారి మిడతలు దండెత్తాయి. రాజస్థాన్​లో మొదలై పంజాబ్​, గుజరాత్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​కు విస్తరించాయి.

Last Updated : May 29, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details