కరోనా వ్యాక్సిన్ రవాణాపై అన్ని విమానయాన సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). డ్రై ఐస్‌తో కొవిడ్-19 వ్యాక్సిన్‌ను విమానాల్లో తీసుకెళ్లే విషయమై పలు సూచనలిచ్చింది.
టీకా రవాణాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి - డీజీసీఏ వార్తలు
కొవిడ్-19 వ్యాక్సిన్ రవాణాపై విమానయాన సంస్థలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది డీజీసీఏ. డ్రై ఐస్‌తో కలిపి ఈ టీకాను విమానాల్లో ఎలా తీసుకెళ్లాలో వివరిస్తూ.. పలు సూచనలు చేసింది.

వ్యాక్సిన్ రవాణాపై ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ మార్గదర్శకాలు
డ్రై ఐస్.. సాధారణ వాతావరణ పీడనంలో మైనస్ 78 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. అందువల్ల దీనిని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) ప్రమాదకరమైనదిగా భావించిందని పేర్కొంటూ.. రవాణాపై పలు జాగ్రత్తలు సూచించింది. విమానంలో కార్బన్ డయాక్సైడ్ డిటెక్టర్లను పెంచాలని నిర్దేశించింది.
ఇదీ చదవండి:'టీకా పంపిణీలో పాల్గొందాం- వారి కృషి అమోఘం'