విమాన ప్రమాద ఘటనల నియంత్రణకు కేంద్ర పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) చర్యలు చేపట్టింది. రన్‌వే, ట్యాక్సీవేపై విమానాలు అదుపుతప్పిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్న తరుణంలో 12 మంది పైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ మధ్య కాలంలో స్పైస్ జెట్ విమానాలు మూడు సార్లు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రెండు సార్లు, గో ఎయిర్ విమానం ఒకసారి రన్‌వే పై అదుపుతప్పాయి.
జైపూర్ నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానం భారీ వర్షాల నడుమ ముంబయి విమానాశ్రయం ప్రధాన రన్‌వేపై అదుపుతప్పింది. పక్కనే ఉన్న గడ్డిలో చిక్కుకుపోయింది. ఫలితంగా ముంబయి ఎయిర్‌పోర్టులోని ప్రధాన రన్‌వే ఇంకా తెరుచుకోలేదు.