తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేవుడికి నంబర్​ ప్లేటు ఇస్తే రోడ్డు ప్రమాదాలకు చెక్​! - telugu human interest stories

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఏముంది ట్రాఫిక్​ నియమాలు తు.చ. తప్పకుండా పాటిస్తే  సరి అంటారా? హిమాచల్​ప్రదేశ్​లోని  భక్తులు మాత్రం.. వాహనాల నంబర్ ​ప్లేట్లను దేవుడికి సమర్పిస్తే చాలు అంటున్నారు. అవును, ఒక్కసారి తమ వాహనాల నంబర్​ ప్లేటును ఆయన వద్ద పెడితే.. ఇక ప్రమాదం తమ దరికి రమ్మన్నా రాదట!

devotees-worship-the-vansheera-devta-by-offering-number-plates-or-parts-of-vehicles-to-avoid-an-accident-in-karsog-mandi-himachal-pradesh
దేవుడికి నంబర్​ ప్లేటు ఇస్తే రోడ్డు ప్రమాదాలకు చెక్​!

By

Published : Jan 7, 2020, 6:21 AM IST

Updated : Jan 7, 2020, 9:07 AM IST

దేవుడికి నంబర్​ ప్లేటు ఇస్తే రోడ్డు ప్రమాదాలకు చెక్​!

ఈ రోజుల్లో రోడ్డెక్కామంటే చాలు.. ఇంటికి వచ్చే వరకూ అనుమానమే. అతివేగం, గుంతలు పడ్డ రోడ్లు, ట్రాఫిక్​ ఉల్లంఘనులతో అడుగడుగునా గండాలే. అందుకే రోడ్డు ప్రమాదాల్లోనే ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. హిమాచల్​ప్రదేశ్​లోని మండి జిల్లా వాసులు మాత్రం ఈ రోడ్డు ప్రమాదాలు తమ దరికి చేరవని ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే వారి వాహనాల నంబరు ప్లేట్లను 'వన​శీరా స్వామి'కి సమర్పించేశారు మరి!

మండి జిల్లా కర్సోగ్​కు 25 కిలోమీటర్ల దూరంలో వన​శీరా ఆలయం ఉంది. ఇక్కడ వాహనాల నంబర్ ​ప్లేటు సమర్పిస్తే.. ఇక ఎలాంటి ప్రమాదం జరగదని ఇక్కడివారి నమ్మకం.

"ఇక్కడ వన​శీరా దేవుడు ఉన్నాడు. ఈ మార్గంలో మేము ఎప్పుడు ప్రయాణించినా.. మా వాహనం నెంబర్​ ప్లేట్​ మేము ఇక్కడే బిగిస్తాం. ఇతర వాహనాల వల్ల మా వాహనానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని మేము కోరుకుంటాం."

-షేర్​ సింగ్​, చోదకుడు

ఎంత హడావిడిగా వెళ్తున్నా సరే.. వన​శీరా స్వామి ఆశీర్వాదం తీసుకోకపోతే ప్రయాణం సాఫీగా సాగదని భక్తులు అంటున్నారు. అక్కడ ఆగి నెంబర్​ప్లేట్లు ఈ చెట్టుకు తగిలించాలి, లేదా కనీసం వాహనంలో విరిపోయిన భాగాలైనా గుర్తుగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ నియమాలు పాటించకపోయినా.. స్వామి వారు ఆ వాహనాన్ని గుర్తుపెట్టుకుని మరీ ఆపదలో కాపాడుతాడంటున్నారు స్థానికులు.

"ఈ వనశీరా దేవుడి ముందు నుంచి వెళ్లేటప్పుడు.. దూపదీపాలతో పూజలు చేస్తాం. విరిగిపోయిన వాహన భాగాలను దేవుడికి సమర్పిస్తాం. ఇలా చేయడం వల్ల మా వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగదని నమ్ముతాం."

-రామ్​ సరన్​, స్థానికుడు

మూఢనమ్మకాలను వీడాలని ఎంతో మంది ప్రచారం చేస్తున్నారు. అయినా వింత నమ్మకాలు ఇప్పటికీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:ఏటా ఎగిరే గాలిపటాల జోరు.. ఈ సారి తగ్గింది!

Last Updated : Jan 7, 2020, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details