2020 సంవత్సరం ఎందరో జీవితాల్లో చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది. వచ్చే ఏడాది తమ జీవితాల్లో కొత్త చిగురు తొడుగుకుంటాయనే ఆశతో అందరూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి.
కశ్మీర్లో... కోల్‌కతాలో..
జమ్ము కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం రద్దీగా మారింది. ఖాత్రాలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కోల్‌కతాలోని కాళీ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నానని ఓ భక్తురాలు తెలిపారు.
దిల్లీలో రద్దీ..
దిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో భక్తులు పూజలు నిర్వహించారు. ఈ ఏడాది అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని ఓ భక్తురాలు తెలిపారు.
గంగాహారతితో..