రక్షాబంధన్, సావన్ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఉత్తరభారతంలోని శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉజ్జయిన్‌లోని మహాకాళేశ్వర ఆలయంలో భస్మారతి నిర్వహించారు అర్చకులు.
సావన్ మాసం ముగింపు- శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు
సావన్ మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో మహాకాళేశ్వర ఆలయంలో భస్మారతి నిర్వహించారు అర్చకులు.
సావన్ మాసం ముగింపు- శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు
దిల్లీ చాంద్నీ చౌక్‌లోని గౌరీశంకర్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. దేవుడిని దర్శించుకోవడం కోసం భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. శరీర ఉష్ణోగ్రతలు చూడటం సహా శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:-అయోధ్యలో దక్షిణాది సంప్రదాయం.. శోభాయమానం