మహాశివరాత్రి రోజున త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. కుంభమేళా ఉత్సవాలకు సోమవారం ఆఖరి రోజు. ఈ ఒక్క రోజే దాదాపు కోటి మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఆదివారం రాత్రి ప్రయాగ్రాజ్లో వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు త్రివేణీ సంగమం చేరుకున్నారు.
ఆఖరి రోజుకు 'జనమేళా'
ప్రయాగ్రాజ్ కుంభమేళా చివరిరోజున జనసంద్రమైంది. మహాశివరాత్రి పర్వదినాన త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆఖరి రోజుకు 'జనమేళా'
రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.