వచ్చే నెలలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలో మొట్టమొదటి సారి భక్తులు హారతిని దర్శించుకోనున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ఆలయంలో రాముని విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
భక్తులకు అనుమతి
విగ్రహాల తరలింపు కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ట్రస్టు అనుమతించింది. ఈ ఏడాది నిర్వహించే వేడుకల ఖర్చును రూ. 51వేల నుంచి రూ.లక్షా 50వేలకు పెంచింది. బాబ్రీ మసీదు ఘటనకు ముందు 1992 నుంచే రామ జన్మభూమిలో పూజారిగా ఉంటున్న మహంత్ సతేంద్ర దాస్.. నిధుల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు.