3 పార్టీల పిటిషన్పై రేపు సుప్రీం అత్యవసర విచారణ
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్పై రేపు ఉదయం 11.30 గంటలకు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ 3 పార్టీలు అత్యవసర విచారణ కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించిన 3 పార్టీలు... బలపరీక్ష రేపే నిర్వహించేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి. బలపరీక్షకు నవంబర్ 30 వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు 3 పార్టీలు పిటిషన్‌లో పేర్కొన్నాయి.
మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ 3 పార్టీలు. పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి. తమ 3 పార్టీలకు కలిపి 144 మందికి పైగా మద్దతుందని పిటిషన్‌లో స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.