ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఆ మహమ్మారిని అంతం చేసే మందును శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. అయితే, కరోనా శరీరంలోకి ప్రవేశిస్తే దానిని జయించే శక్తి భారతీయులు సులభంగా పొందొచ్చు అంటున్నారు ఉత్తరాఖండ్ హల్ద్వాన్కు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మీరా జోషి. ఎలాంటి వైరస్ను అయినా అంతం చేసే రోగనిరోధక శక్తిని భారతీయ సంప్రదాయం, ఆయుర్వేదంతో సంపాదించుకోవచ్చు అంటున్నారు.
ఇంగ్లీషు మందుల కంటే.. ఆయుర్వేదంతోనే కరోనాను సులభంగా జయించొచ్చని చెబుతున్నారు డాక్టర్ మీరా జోషి.