రాజ్యసభ ఎన్నికల కోసం మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ నామపత్రం దాఖలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్న, ఇతర జేడీఎస్ నేతలతో కలిసి బెంగళూరులోని విధాన సౌధలో శాసనసభ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.
కర్ణాటకలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాలకు గానూ భాజపా రెండు, కాంగ్రెస్ ఒక స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు జాతీయ నాయకుల అభ్యర్థన మేరకు దేవెగౌడ ఎన్నికల బరిలో నిలిచినట్లు కుమారస్వామి తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేవెగౌడ రెండోసారి రాజ్యసభలో అడుగుపెడతారు.
2019 లోక్సభ ఎన్నికల్లో తుమకూరు స్థానంలో పోటీ చేసి దేవెగౌడ ఓటమిపాలయ్యారు.
24 ఏళ్లు పెద్ద...