తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్థిక వృద్ధికి దృఢ ప్రయత్నాలు అవసరం' - vaccines do offer hope of shielding people

కరోనా కారణంగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు దృఢ సంకల్పంతో కూడిన ప్రయత్నాలు అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు టీకాలు ఆశాకిరణంగా మారాయని చెప్పారు. గోవా శాసనసభ్యుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Jan 9, 2021, 10:22 PM IST

Updated : Jan 9, 2021, 11:01 PM IST

కరోనా నుంచి ప్రజలను రక్షించే ఆశాకిరణంలా వ్యాక్సిన్లు మారాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మహమ్మారి కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్ధిక వ్యవస్థ.. తిరిగి వృద్ధి పథంలో దూసుకుపోవాలంటే దృఢమైన ప్రయత్నాలు అవసరమని అన్నారు.

గోవా పోర్వోరిమ్​లో ఏర్పాటు చేసిన 'గోవా శాసనసభ్యుల దినోత్సవం' కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆర్థికవ్యవస్థను వృద్ధి దిశగా నడిపించేందుకు కేంద్రం ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెడుతోందని చెప్పారు.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్​ను అధిగమించేందుకు దేశంలోని శాసనసభ్యులందరూ తీవ్రంగా కృషి చేయాలని వెంకయ్య సూచించారు. జాతీయ ప్రయత్నంతోనే ప్రస్తుత పరిస్థితి నుంచి త్వరగా బయటపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్​​ బీఎస్ కోశ్యారీ, గోవా అసెంబ్లీ స్పీకర్​ రాజేశ్​ పట్నేకర్​, సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.

Last Updated : Jan 9, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details