ప్రతిఏటా కనులపండువగా జరిగే ఓనం ఈసారి కరోనా కారణంగా నిరాడంబరంగా సాగింది. అయితే మలయాళీల ఉత్సాహంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రత్యేకించి చిన్నారులు, కళాశాల విద్యార్థులు ఈసారి వినూత్నంగా వర్చువల్గా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ఇలా వేడుక జరుపుకోవడం వారికి సులభమయ్యింది.
ఆన్లైన్ ఓనం ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు తమ కళాప్రదర్శనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అబ్బురపరిచారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. వంటల పోటీలు నిర్వహించారు. నృత్యప్రదర్శనతో అలరించారు. వారి డాన్స్ వీడియోలను స్వయంగా ఎడిట్ చేసుకుని గ్రూప్ వీడియోలుగా మార్చి సమర్పించారు. విద్యార్థుల టాలెంట్ చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మంత్రముగ్దులయ్యారు. ఓనం పండుగను వర్చువల్గా జరుపుకోవడం ద్వారా సరికొత్త అనుభూతిని పొందినట్లు చెప్పారు.