త్రివిధ దళాల సిబ్బంది విషయంలో అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనలను సడలిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు దళాల సిబ్బంది సెలవుల నుంచిగానీ, తాత్కాలిక విధుల నుంచిగానీ తమ స్థావరాలకు తిరిగి వస్తే తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన ఇంతవరకు అమలయ్యింది. సరిహద్దుల్లో మరింత మంది సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో ఈ నిబంధనల్లో మార్పులు చేశారు. స్థావరానికి చేరుకోవడానికి 14 రోజులకు ముందు కరోనా పాజిటివ్ వ్యక్తితో కలవకపోతే చాలు..మళ్లీ క్వారంటైన్ అవసరం లేదని తెలిపారు. రోగ లక్షణాలు బయటపడకున్నా కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పనిలేదని సూచించారు. విధి నిర్వహణ నిమిత్తం మధ్యలో ఎక్కడా ఆగకుండా మిలటరీ వాహనాల్లోగానీ, సొంత వాహనాల్లోగానీ ప్రయాణించినా క్వారంటైన్ అవసరం లేదని పేర్కొన్నారు.
జవాన్లకు క్వారంటైన్ నిబంధనల సడలింపు
త్రివిధ సైనిక దళాల క్వారంటైన్ నిబంధనలను సడలిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అదనపు సిబ్బంది అవసరముంది. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా నిబంధన ప్రకారం, స్థావరానికి చేరుకోవడానికి 14 రోజులకు ముందు కరోనా పాజిటివ్ వ్యక్తితో కలవకపోతే చాలు..మళ్లీ క్వారంటైన్ అవసరం లేదు.
జవాన్లకు క్వారంటైన్ నిబంధనల సడలింపు
TAGGED:
Quarantine