మరోసారి దిల్లీ పీఠం అధిష్ఠించేందుకు ఆమ్ఆద్మీ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఫలితాల సరళి ప్రకారం ఇప్పటికే సాధారణ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆప్ దూసుకుపోతోంది. కానీ పట్పడ్గంజ్ స్థానం నుంచి బరిలో నిలిచిన పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో మాత్రం విజయం దోబూచులాడుతోంది. పలు రౌండ్లలో ఆయన వెనుకంజలో ఉండటం, మళ్లీ ఆధిక్యంలోకి రావడం ఇలా జరుగుతోంది.
దిల్లీ తీర్పు: డిప్యూటీ సీఎంతో విజయం దోబూచులాట! - దిల్లీ తాజా ఎన్నికల ఫలితాలు
కేజ్రీవాల్ న్యూదిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆప్ అభ్యర్థులు ఇప్పటికే సాధారణ మెజరిటీ స్థానాలను గెలుపొందేందుకు పరిగెడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో మాత్రం విజయం దోబూచులాడుతోంది.
ఆమ్ ఆద్మీ జోరు... డిప్యూటీ సీఎం బేజారు!
భాజపా అభ్యర్థి రవి నేగి నుంచి సిసోడియాకు ఆది నుంచి గట్టిపోటీ ఎదురైంది. పలు రౌండ్లలో నేగి ఆధిక్యాన్ని కనబరిచారు.
Last Updated : Feb 29, 2020, 11:26 PM IST