వచ్చే వారం వరకు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెనుదిరిగే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణమని పేర్కొంది. ఫలితంగా దేశంలో వర్షాకాలం మరికొన్ని రోజులు కొనసాగనుందని పేర్కొంది.
ఉత్తరాంధ్రలో ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఒడిశాలో 13న వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.